Thursday, January 23, 2025

డబుల్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. ఇంగ్లాండ్ టార్గెట్ 557 పరుగులు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నిగ్స్ లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సులతో చెలరేగిన జైశ్వాల్ 214 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ద్విశతకంతో విజృంభించిన జైశ్వాల్ అజేయంగా నిలిచాడు.

శుభ్ మన్ గిల్(91), సర్ఫరాజ్ ఖాన్(68 నాటౌట్)లు కూడా రాణించడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 98 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. దీంతో భారత్, ఇంగ్లండ్ జట్టుకు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News