Thursday, January 23, 2025

రవీంద్ర జడేజా సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ సాధించాడు. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో జడేజా సెంచరీ బాదాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ కు కెప్టెన్ రోహిత్(131)తో కలిసి జడేజా 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు.

రోహిత్(131) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(62 పరుగులు, 66 బంతుల్లో) కూడా అర్థ శకతంతో చెలరేగాడు. ఈ క్రమంలో లేని పరుగు కోసం వెళ్లి సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. అనంతరం జడేజా శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 83 ఓవర్లలో 315 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(100), కుల్దీప్ యాదవ్(0)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News