సిరీస్‌పై ఇంగ్లండ్ కన్ను
భారత్‌కు పరీక్ష, నేడు నాలుగో టి20
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో గురువారం జరిగే నాలుగో ట్వంటీ20 మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు సవాలుగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి కోహ్లి సేనకు నెలకొంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో మోర్గాన్ సేన ఉంది. ఇలాంటి స్థితిలో టీమిండియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మూడో టి20లో కెప్టెన్ విరాట్ కోహ్లి తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ ఆశించిన స్థాయిలో స్కోరును నమోదు చేయలేక పోయింది. బౌలర్లు కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలం కావడంతో భారత్‌కు ఘోర పరాజయం తప్పలేదు. కానీ, ఈ మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలనే పట్టుదలతో ఆటగాళ్లు ఉన్నారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఓపెనర్లు ఈసారైనా..
ఈ సిరీస్‌లో భారత ఓపెనర్లు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేక పోయారు. స్టార్ ఓపెనర్ కెఎల్.రాహుల్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు మ్యాచుల్లో కలిపి ఒక్క పరుగు మాత్రమే నమోదు చేశాడు. ఒక సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. కిందటి మ్యాచ్‌లో రోహిత్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ కూడా విఫలయ్యాడు. ఇక యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ కిందటి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో దిగిన కిషన్ 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌కు చాన్స్ ఇస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. రాహుల్‌ను తప్పిస్తే రోహిత్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
కోహ్లిపైనే ఆశలు..
మరోవైపు టీమిండియా బ్యాటింగ్ ఆశలన్నీ కెప్టెన్ విరాట్ కోహ్లిపైనే ఆధారపడి ఉన్నాయి. కోహ్లి వరుసగా రెండు మ్యాచుల్లోనూ అజేయ అర్ధ సెంచరీలతో అలరించాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే భారత్‌కు భారీ స్కోరు కష్టమేమీ కాదు. అయితే అతనికి అండగా నిలిచే బ్యాట్స్‌మన్ కావాలి. రెండో టి20లో ఇషాన్ కిషన్ కెప్టెన్ కోహ్లికి అండగా నిలిచాడు. కిందటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య సహకారం అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కూడా ఎవరూ ఒకరూ కోహ్లికి అండగా నిలువాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాగానే ఆడుతున్నా భారీ స్కోర్లు మాత్రం సాధించలేక పోతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన రిషబ్ భారీ స్కోరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటువంటి బౌలింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా రిషబ్‌కు ఉంది. అయితే కీలక సమయంలో వికెట్‌కు పారేసుకునే బలహీనత అతనికి శాపంగా మారింది. ఈసారి లోపాన్ని సవరించుకుంటే భారీ స్కోరు సాధించడం రిషబ్‌కు కష్టమేమీ కాదు. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా తొలి మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్‌లో కూడా పర్వాలేదనిపించాడు. కానీ మూడో టి20లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్‌పై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ తదితరులు కూడా ఇటు బంతితో అటు బ్యాట్‌తో రాణించక తప్పదు. బౌలర్లు భువనేశ్వర్, చాహల్, సుందర్, ఠాకూర్‌లు కూడా మరింత మెరుగైన బౌలింగ్‌ను కనబరచాల్సిందే. అప్పుడే ఈ మ్యాచ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలుంటాయి. లేకుంటే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.
ఆత్మవిశ్వాసంతో ఉంది..
ఇక పర్యాటక ఇంగ్లండ్ కిందటి మ్యాచ్‌లో విజయంతో జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బెయిర్‌స్టో, జాసన్ రాయ్, మలాన్‌లతో పాటు జోస్ బట్లర్ దూకుడుగా ఆడుతున్నాడు. కిందటి మ్యాచ్‌లో బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బట్లర్ అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. బెయిర్‌స్టో కూడా దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. అయితే రాయ్, మలాన్‌లు ఇప్పటి వరకు భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఈసారి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. మోర్గాన్, స్టోక్స్, మార్క్‌వుడ్, శామ్ కరన్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక జోఫ్రా ఆర్చర్, కరన్, స్టోక్స్, మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్‌లతో బౌలింగ్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారింది. దీంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
IND vs ENG 4th T20 Match on March 18