Monday, January 20, 2025

రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 219/7..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తడబాటుకు గురైంది. ఇంగ్లండ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో క్రీజులో ఎక్కువసేపు నిలబడలేక పెవిలియన్ కు క్యూట్టారు. ఓపెనర్ రోహిత్ శర్మ(2), రజత్ పాటిదర్(17), రవీంద్ర జడేజా(12), సర్ఫరాజ్ ఖాన్(14), అశ్విన్(1)లు ఘోరంగా విఫలమయ్యారు. శుభ్ మన్ గిల్(38) పర్వాలేదనిపించినా భారీ స్కోరు చేయలేకపోయాడు.యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(73) అర్థ శతకంతో మరోసారి రాణించాడు. దీంతో భారత్ 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో ధ్రువ్ జురైల్(20), కుల్దీప్ యాదవ్(14)ల జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 219/7 చేసింది. భారత్, ఇంగ్లండ్ కంటే ఇంకా 134 పరుగులు వెనుకంజలో ఉంది. అంతకుముందు రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353 పరుగులకు ఆలౌటైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News