ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం
భారత్ 466 పరుగులకు ఆలౌట్
ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల భారీ లక్ష్యం
లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఔటయి మ్యాచ్‌ను చేజార్చుకునే స్థితిలో ఉండిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించడం ద్వారా మ్యాచ్‌ను కాపాడుకునే స్థితికి చేరుకోవడమే కాకుండా చివరి రోజు ఇంగ్లాండ్‌బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చే స్థితికి చేరుకుంది. నాలుగో రోజు టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా 368 పరుగుల విజయ లక్షంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి …. పరుగులు చేసింది. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే రహానే(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(44) వికెట్లను కోల్పోవడంతో భోజన విరామ సమయానికే 329 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే వీరిద్దరూ ఔటయిన తర్వాత వచ్చిన రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌లు ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత వెంట వెంటనే ఔటయ్యారు. శార్దూల్ ఠాకూర్ మరోసారి అద్భుతంగా ఆడి కేవలం 72 బంతుల్లో ఒక సిక్స్,7 ఫోర్లతో 60 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 106 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. వీరిద్దరూ కేవలం రెండు పరుగులు తేడాలో వెంటవెంటనే ఔటయ్యారు. తొలుత రూట్ బౌలింగ్‌లో శార్దూల్ స్లిప్‌లో ఓవర్టన్‌కు దొరికి పోగా, తర్వాతి ఓవర్‌లోనే పంత్ మొయిన్ అలీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత టెయిలెండర్లు బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లు కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించడమే కాకుండా ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల భారీ లక్షాన్ని ఉంచింది. ఉమేశ్ యాదవ్ 25 పరుగులు చేయగా, బుమ్రా 24 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టగా,ఓలి రాబిన్సన్, మొయిన్ అలీలు చెరి రెండు వికెట్లు సాధించారు. ఆండర్సన్, ఓవర్టన్, జో రూట్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.
నాలుగో క్రికెటర్‌గా శార్దూల్
కాగా ఎనిమిదో నంబరు స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన నాలుగో భారత బ్యాలట్స్‌మన్‌గా శార్దూల్ ఠాకూర్ కొత్త రికార్డును అందుకున్నాడు. ఇంతకు ముందు హర్భజన్ సింగ్,(న్యూజిలాండ్‌పైన), భువనేశ్వర్ కుమార్ (ఇంగ్లాండ్‌పైన), వృద్ధిమాన్ సాహా(న్యూజిలాండ్‌పైన) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.