Thursday, January 23, 2025

చెలరేగిన కుల్దీప్, అశ్వన్.. 218 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకే ఆలౌటైంది. ధర్మశాల స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ .. మొదటి సెషన్ లో బాగానే పరుగులు రాబట్టారు. జాక్ క్రాలే 79 అర్థ శతకంతో రాణించాడు. అయితే, టీమిండియా స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ లు చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. బెన్ డకెట్(27), ఓలీ పోప్(11), జోయ్ రూట్ (26), జానీ బయిర్ స్టో(29), ఫోక్స్(24)లు భారీ స్కోరు చేయకపోవడంతో.. ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే పరిమతమైంది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(20), యశస్వీ జైస్వాల్(24)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News