Sunday, December 22, 2024

చెలరేగిన పంత్, జడేజా.. కష్టాల్లో ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

IND vs ENG 5th Test: England lost 5 wickets for 84 runs

జడేజా శతకం, బుమ్రా రికార్డు ఇన్నింగ్స్,
భారత్ 416 ఆలౌట్, కష్టాల్లో ఇంగ్లండ్

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. శనివారం రెండో రోజు ఆటకు వర్షం పలుసార్లు ఆటంకం కలిగించింది. దీంతో టివిరామానికి ముందు ఆటను అర్ధాంతరంగా నిలిపి వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా సేపటికే ఆట తిరిగి ప్రారంభమైంది. ఇక ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు అలెక్స్ లీస్(6), జాక్ క్రాలి(9) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఓలి పోప్(10) కూడా నిరాశ పరిచాడు. ఈ క్రమంలో జో రూట్ (31) కొద్ది సేపు పోరాటం చేశాడు. కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 27 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును చేరుకోవాలంటే ఇంగ్లండ్ మరో 332 పరుగులు చేయాలి. ఇక భారత బౌలర్లు బుమ్రా మూడు, షమి, సిరాజ్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
జడేజా శతకం
అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా శతకంతో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జడేజా 194 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక విదేశాల్లో జడేజాకు ఇదే తొలి శతకం కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బుమ్రా చారిత్రక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు సాధించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

IND vs ENG 5th Test: England lost 5 wickets for 84 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News