- Advertisement -
నాటింగ్‌హామ్: తొలి టెస్టులో ప్రత్యర్థి టీమిండియా ముందు ఆతిథ్య ఇంగ్లండ్ 209 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. ఒంటరి పోరాటం చేసిన జో రూట్ 14 ఫోర్లతో 109 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో బెయిర్‌స్టో (30), శామ్ కరన్ (32), లారెన్స్ (25), డొమినిక్ సిబ్లీ (28) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల భారీ ఆధిక్యం సాధించడం టీమిండియాకు కలిసి వచ్చింది. దీంతో మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ 209 పరుగులు చేయాల్సి ఉంది. తాజా సమాచారం లభించే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.
- Advertisement -