Friday, March 7, 2025

పటిష్ఠంగా టీమిండియా

- Advertisement -
- Advertisement -

జట్టులోకి విరాట్, రోహిత్.. షమీ రీఎంట్రీ
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
ఆతిథ్య జట్టుకు సవాల్ వంటిదే..

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐదు టి20ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకొని ఘనంగా ముగించిన భారత్ ఇప్పుడు మరో ఔమరానికి సిద్దమైంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగబోయే ఈ సిరీస్ టీమిండియాకు కీలకంగా మారింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సిరీస్ షురూకానుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బరిలోకి దిగే భారత జట్టే ఈ సిరీస్ ఆడనుంది. మెగా టోర్నీకి ముందు ఈ మూడు వన్డేలను టీమిండియా సన్నాహకంగా ఉపకరించనుంది.

అయితే.. పొట్టి సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్ల్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుదనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెన్ను నొప్పితో జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. దాంతో పేస్ విభాగాన్ని ఎవరు నడిపిస్తారనేది కూడా చర్చనీయాంశమైంది. అయితే ముగిసిన టి20 సిరీస్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జట్టులో చేరిన సంగతి తెలిసింది. ఈ సిరీస్‌లోనూ షమీ కొనసాగిస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

రెండో ఓపెనర్ ఎవరో..

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు జతగా ఎవరు ఓపెనింగ్ చేస్తారు? వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, కెఎల్ రాహుల్‌లో ఎవరికి చోటు దక్కుతుందనేది కీలకంగా మారింది. ఈ సందేహాలన్నింటికీ ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పరిష్కారం లభించనుంది. ఇప్పటికే ఈ సిరీస్ బరిలో నిలిచే ఆటగాళ్లు నాగ్‌పూర్ చేరుకొని బిసిసిఐ నిర్వహిస్తున్న ప్రీ- ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నారు. ఓపెనింగ్ జోడీలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తే.. యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది. అప్పుడు గిల్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు బదులు కెఎల్ రాహుల్ బరిలోకి దించేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒకవేళ గిల్‌ను ఓపెనర్‌గా పరిగణలోకి తీసుకుంటే రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా ఆడే అవకాశాలున్నాయి. అది జరిగితే కెఎల్ రాహుల్ బెంచ్‌కే పరిమితమవుతాడు. యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే శ్రేయస్ అయ్యర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

అక్షర్ పటేల్‌కు నోఛాన్స్..

విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా రాకతో అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లు ప్రధాన పేసర్లుగా ఆడనున్నారు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తోనే బరిలోకి దిగాలనే భావిస్తోంది. ఇక గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో షమీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో బౌ లింగ్ దళానికి షమీ సారధ్యం వహించనున్నాడు. అయితే మూడు వన్డేకు బుమ్రా జట్టులో చేరనున్నాడు. దీంతో భారత బౌలింగ్ మరింత పటిష్టంగా మారనుంది. అయితే ఈ వన్డే సిరీస్‌లో సయితం ఇంగ్లండ్‌కు గట్టి సవాల్ ఎదుర్కొనుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పవచ్చు. కాగా, ఈనెల 6న నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డేతో ప్రారంభం కానున్న ఈ సిరీస్ రెండో వన్డే 9న కటక్‌లో, చివరి వన్డే అహ్మదాబాద్ ఈనెల 12న జరుగనుంది. ఇక వారం రోజులం విరామం అనంతరం ఛాంపియన్ ట్రోఫీ లో ఆడేందుకు దుబాయ్ బయలుదేరివెళ్లనుంది.

వన్డే సిరీస్‌కు భారత జట్టు..

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News