పూణె : ఇండియా-ఇంగ్లండ్ మధ్య త్వరలో జరగనున్న వన్డే సిరీస్ పూణేలో నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ టోర్నీ నిర్వహణకు మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రే నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఈ మ్యాచ్ను లైవ్లో చూసేందుకు మాత్రం ప్రేక్షకులకు అనుమతిని నిరాకరించింది. ఇటీవల కరోనా కేసులు మహారాష్ట్రలో విపరీతంగా పెరిగిన కారణంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మార్చి నుంచి జరగాల్సిన వన్డే మ్యాచ్లు పూణేలో జరుగుతాయా..? లేదా..? అనే అనుమానం అందరిలో ఏర్పడింది. ఈ మ్యాచ్లను బీసీసీఐ వేరే చోటికి మార్చే ఆలోచనలో ఉందంటూ అనేక రూమర్లు కూడా వచ్చాయి. వీటన్నింటినీ పక్కన పెడుతూ పూణేలోనే మ్యచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఇప్పుడు సీఎం ఉద్ధవ్ కూడా దానికి అంగీకరించడంతో మ్యాచ్లు జరగడం ఖాయమైంది. అయితే ప్రేక్షకులను అనుమతించేందుకు మాత్రం ఉద్ధవ్ సర్కార్ నిరాకరించింది. దీంతో వన్డే మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న పూణేవాసులకు నిరాశే మిగిలింది.
IND vs ENG ODI Squad to shifted Pune due to Covid 19