Wednesday, January 22, 2025

భారత్-ఐర్లాండ్ చివరి టి20 వర్షార్పణం..

- Advertisement -
- Advertisement -

డబ్లిన్: భారత్‌-ఐర్లాండ్ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మూడో, చివరి టి20 వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. తొలి రెండు టి20లలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక చివరి టి20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News