Wednesday, January 22, 2025

ఉప్పల్ లో తొలి వన్డే: భారత్ బ్యాటింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో దిగుతున్న టీమిండియా సిరీస్ పై కన్నేయగా.. మరోవైపు పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన న్యూజిలాండ్ కూడా జోరుమీదుంది. భారత్‌పై కూడా సంచలన విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News