న్యూజిలాండ్ టూర్‌కు భారత్ రెఢీ
వన్డే జట్టు కెప్టెన్‌గా ధావన్
టి20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య
రోహిత్, కోహ్లీకు విశ్రాంతి
18న తొలి టి20తో వైట్‌బాల్ సిరీస్ షురూ
వెల్లింగ్టన్: ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో మరో మూడు రోజుల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య వైట్‌బాల్ సిరీస్‌కు తెర లేవనుంది. భారతజట్టు కివీస్‌తో మూడు వన్డేలు, మూడు టి20ల్లో తలపడనుంది. వన్డేలకు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా టి20లకు హార్దిక్‌పాండ్య సారథిగా వ్యవహరించనున్నాడు. కెప్టెన్ రోహిత్‌శర్మ, కెప్టెన్ కోహ్లీకు బిసిసిఐ విశ్రాంతినిచ్చింది. యువ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్‌సేన్ చోటు దక్కించుకున్నారు. భారత్ న్యూజిలాండ్ పర్యటనలో ముందుగా టి20 సిరీస్‌లో తలపడనుంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టి 20 ఈ నెల తేదీ శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా స్కై స్టేడియంలో మధ్యాహ్నం ప్రారంభం కానుంది. పొట్టి సిరీస్‌లోని రెండో టి20 20వ తేదీ ఆదివారం మాంగనూయిలో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి మూడో టి20 ఈనెల 22వ తేదీ మంగళవారం వేదికగా జరగనుంది. టి20 సిరీస్ అనంతరం వన్డే సిరీస్‌లో తొలి వన్డే ఈడెన్‌పార్క్ వేదికగా 25శుక్రవారం 7గంటలకు జరగనుంది. రెండో టి20 నవంబర్ 27 ఆదివారం వేదికగా, మూడో టి20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా 30 బుధవారం జరగనుంది.
భారత్ వన్డే జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), గిల్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, దీపక్‌హుడా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రిషభ్‌పంత్ (వికెట్‌కీపర్), సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్‌సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్‌సేన్.
భారత్ టి20 జట్టు: సూర్య, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య(కెప్టెన్), దీపక్ హుడా, సుందర్, రిషభ్‌పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్(వికెట్‌కీపర్), యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
IND vs NZ 1st T20 Match on Nov 18