Wednesday, January 22, 2025

భారత్-న్యూజిలాండ్ టెస్టు.. తొలి రోజు ఆట రద్దు

- Advertisement -
- Advertisement -

భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు.. మొదటి రోజు ఆట వర్షార్పణమైంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు బుధవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. టాస్ పడకుండానే ఆట రద్దైంది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా భారత్, కివీస్ జట్లు తొలి టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే నిన్నటి నుంచి వర్షం కురుస్తుండటంతో అంపైర్లు ఆటను ప్రారంభించలేదు. లంచ్, టీ బ్రేక్ వరకు వేచి చూసినా.. మ్యాచ్ ను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News