Friday, January 3, 2025

భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు: వర్షంతో తొలి సెషన్ రద్దు

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు ప్రారంభం కాలేదు. టాస్ కూడా వేసే పరిస్థితి లేదు. మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. ఈ క్రమంలో తొలి సెషన్ ఆట కూడా ముగియడంతో లంచ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో టాస్ ఇంకా ఆలస్యం కానుంది. లేకపోతే తొలి రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది.

లంచ్‌ బ్రేక్ తర్వాత పరిస్థితినిబట్టి టాస్‌ పై నిర్ణయం తీసుకుంటారు. కాగా, బెంగళూరులో ఐదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్-కివీస్ తొలి టెస్టు జరగడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News