Monday, December 23, 2024

ఉత్కంఠ పోరులో కివీస్‌పై టీమిండియా గెలుపు

- Advertisement -
- Advertisement -

లక్నో: పొట్టి సిరీస్ కైవసం చేసుకోవాలంటే గెలిచి తీరాల్సిన మాచ్‌లో టీమిండియా భరిత విజయం సాధించింది. చివరి ఓవరు వరకు ఇరుజట్లువైపు ఊగిసలాడిన విజయం చివరికి వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు నష్టానికి చేసింది. భారత బౌలింగ్ దళం సమష్టిగా రాణించి న్యూజిలాండ్‌ను కట్టడి చేసింది. అర్షదీప్‌సింగ్ రెండు వికెట్లు తన వేసుకున్నాడు. 19పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కెప్టెన్ శాంట్నర్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

అనంతర కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఓవర్లలో 4వికెట్లును కోల్పోయి చేసి ఛేదించింది. 31బంతుల్లో ఓ బౌండరితో 26పరుగులు చేసిన అజేయంగా నిలిచిన సూర్య జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్ పై సాధించాల్సింది 101 పరుగులే అయినా, గెలిచేందుకు టీమిండియా చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ లో టీమిండియా 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసిన భారత్ ఎట్టకేలకు గెలుపుతీరాలకు చేరింది. సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ షాట్ గా బౌండరీ కొట్టడంతో విజయం ఖరారైంది. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 పరుగులతో అజేయంగా నిలిచారు. గిల్ 11, ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13, వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు. కిషన్, సుందర్ రనౌట్ రూపంలో వెనుదిరిగారు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ లో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News