Sunday, December 22, 2024

ఇరు జట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

మౌంట్ మాంగనూయ్: భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ జరుగనుంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం వల్ల బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఈ పరిస్థితుల్లో రెండో టి20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కార్తీక్, షమి, రాహుల్, అశ్విన్, బుమ్రా తదితరులు లేకుండానే భారత్ సిరీస్‌కు సిద్ధమైంది. హార్దిక్ పాండ్య జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న హార్దిక్‌కు ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. కివీస్ వంటి బలమైన జట్టును ఓడించి సిరీస్ సొంతం చేసుకుంటే హార్దిక్‌కు తిరుగే ఉండదు.

ఇదే జరిగితే రానున్న రోజుల్లో టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు సూర్యకుమార్ చాలా కీలకంగా మారాడు. ఇటీవల కాలంలో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న సూర్యకుమార్ కివీస్‌పై కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్య చెలరేగితే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. ఇక శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. వీరికి తోడు హార్దిక్, దీపక్ హుడాల రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్న విషయం తెలిసిందే. ఉమ్రాన్ మాలిక్, చాహల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.

ఇక ఆతిథ్య న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు సానుకూల పరిణామంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా కనిపిస్తోంది. ఫిన్ అలెన్, కాన్వే, విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, మిఛెల్ సాంట్నర్, నీషమ్‌లతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక టిమ్ సౌథి, ఐష్ సోధి, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్, సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో కివీస్ కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

IND vs NZ 2nd T20 Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News