Thursday, January 23, 2025

రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(01), కివీస్ స్పిన్నర్ బ్రేస్ వేల్ బౌలింగ్ లో ఎల్బిడబ్యూగా వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(44) ధనాదన్ బ్యాటింగ్ తో అలరించాడు. మరో ఓపెనర్ గిల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో గిల్(46), సూర్యకుమార్ యాదవ్(07)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News