Wednesday, January 22, 2025

కివీస్ కు షాకిచ్చిన హార్దిక్, అర్షదీప్.. 7 పరుగులకే 4 వికెట్లు..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కేవలం 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు కాన్వే(1), అలెన్(3)లతోపాటు చప్ మన్(0), గ్లెన్ ఫిలిప్స్(2)లు ఘోరంగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సూర్యకుమార్ అందుకున్న రెండు అద్భుతమైన క్యాచులతో గ్లెన్ ఫిలిప్స్, అలెన్ పెవిలియన్ చేరారు. ఇక..  కాన్వే, చప్ మన్ లను అర్షదీప్ బుట్టలో వేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News