Monday, December 23, 2024

శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ.. సూర్య ఔట్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ అర్థ శతకం బాదాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. మరో బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిపాఠి(44) కూడా ధనాదన్ బ్యాటింగ్ తో అలరించాడు.

అయితే, భారీ షాట్ యత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(24) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో గిల్(53), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(05)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News