Thursday, January 23, 2025

పెవిలియన్ కు క్యూ కట్టిన బ్యాట్స్ మెన్స్.. ఓటమి దిశగా టీమిండియా

- Advertisement -
- Advertisement -

మూడో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నాయి. ఆ జట్టు విధించిన 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కివీస్ బౌలర్లు చెలరేగుతుండటంతో భారత్ బ్యాట్స్ మెన్లు వరుసగా ఒక్కరి వెంట ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో టీమిండియా కేవలం 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(11), ఓపెనర్ యశస్వీ జైస్వాల్(5), శుభ్‌మన్ గిల్‌(1), విరాట్ కోహ్లీ(1), జడేజా(6), సర్ఫరాజ్ ఖాన్(1)లు తీవ్రంగా నిరాశ పర్చారు. ప్రస్తుతం భారత్ 19 ఓవర్లలో 86 పరుగులు చేసింది. క్రీజలో పంత్(46), వాషింగ్టన్ సుందర్(03)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News