Saturday, December 28, 2024

లంచ్‌ బ్రేక్‌.. టీమిండియా 81/1

- Advertisement -
- Advertisement -

359 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ధనాధన్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ(08)మరోసారి నిరాశపర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ తో కలిసి జైస్వాల్.. న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే మూడు సిక్సులు, మూడు ఫోర్లు బాది 46 పరుగులు చేశాడు. ఇక, శుభ్‌మన్‌ గిల్ 22 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది.ఈమ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఇంకో 278 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News