హామిల్టన్: తొలి వన్డేలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు న్యూజిలాండ్‌తో జరిగే రెండో మ్యాచ్ చావోరేవోగా మారింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో కెప్టెన్ శిఖర్ ధవన్, శుభ్‌మన్‌గిల్ బ్యాటింగ్ ఆరంభించనున్నారు. గత మ్యాచ్‌లో మాదిరిగానే శుభారంభాన్ని అందిస్తారేమో వేచి చూడాల్సిందే.
సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే భారత్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. ఇందులో ఓడితే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం. ఇక మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన ఆతిథ్య న్యూజిలాండ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులో గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. మొదటి వన్డేలో అంతగా ఆకట్టుకోలేకపోయిన సంజూ సాంసన్, శార్ధూల్ ఠాకూర్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. వారి స్థానంలో దీపక్ హుడా, దీపక్ చాహర్‌కు తుది పదకొండులో చోటుకల్పించింది.