Thursday, November 21, 2024

భారత్ కు సవాల్ లాంటిది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగే మూడో, చివరి టెస్టు టీమిండియాకు సవాల్ వంటిదేనని చె ప్పాలి. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన ఆతిథ్య జట్టు భారత్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి స్థితిలో చివరి టెస్టులో న్యూజిలాండ్‌ను ఓడించడం అ నుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి. బ్యాటిం గ్ వైఫల్యం భారత్‌కు అతి పెద్ద సమస్యగా మా రింది. సొంత గడ్డపై భారత్‌కు ఇలాంటి ఫ లితం ఎదురవుతుందని ఎవరూ ఊహించలే దు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. అయినా కూడా న్యూజిలాండ్ వంటి బలహీనమైన జట్టు చేతిలో సిరీస్‌ను కోల్పోవడం ఊహించని పరిణామంగా చెప్పాలి. సుదీర్ఘ కాలం తర్వాత భారత్ సొంత గడ్డపై సిరీస్‌ను చేజార్చుకుంది. సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో భారత్ ఎలాంటి పోటీ ఉండదని అందరూ భా వించారు.

కివీస్ విజయం అటుంచి ఒక్క మ్యాచ్ ను డ్రాగా ముగించినా అదే గొప్ప అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారత్ కచ్చితంగా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందని వారు జోస్యం చెప్పారు. కానీ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనే ఈ అంచనాలను న్యూజిలాండ్ తారుమారు చేసింది. రోహిత్, యశస్వి,కోహ్లి, రాహుల్, రిషబ్, అశ్విన్, జడేజా వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు ఉన్న టీమిండియాను 46 పరుగులకే కుప్పకూల్చి పెను సంచలనం సృష్టించింది. సొంత గడ్డపై టీమిండియా తక్కువ స్కోరుకు ఆలౌటవుతుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ కివీస్ బౌలర్ల అసాధారణ బౌలింగ్ ముందు భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. అందరూ కలిసి కనీసం 50 పరుగుల స్కోరును కూడా సాధించలేక పోయారు. ఈ పరిణామం టీమిండియాకు అతి పెద్ద షాక్‌లాంటిదేనని చెప్పాలి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి పెద్ద పెద్ద జట్లను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్‌కు కివీస్ చేతిలో చేదు అనుభవం ఎదురు కావడం నిజంగా కలవర పరిచే అంశమే.

బ్యాటింగే సమస్య..

టీమిండియా సిరీస్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పాలి. ప్రపంచ స్థాయి బ్యా టర్లతో కూడిన భారత్ సొంత గడ్డపై చెత్త బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశ గురిచేస్తోంది. రెండు టెస్టుల్లోనూ భారత బ్యాటర్లు పేలవమైన ప్రదర్శన తో నిరాశ పరిచారు. కోహ్లి, రోహిత్ శర్మ, గిల్, స ర్ఫరాజ్, పంత్, అశ్విన్, జడేజా వంటి స్టార్లు ఉ న్నా ఫలితం లేకుండా పోయింది. రెండు టెస్టుల్లో కూడా బ్యాటర్లు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.

కనీసం రానున్న మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. సిరీస్‌లో కాస్తయినా పరువు దక్కించుకోవాలంటే నవంబర్ ఒకటి నుంచి జరిగే మూడో, చివరి టెస్టులో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇది సాధ్యం కావాలంటే బ్యాటర్లు గాడిలో పడక తప్పదు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించాలి. యశస్వి, సర్ఫరాజ్, కోహ్లి, పంత్, జడేజా, గిల్ తదితరులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిందే. అప్పుడే భారత్‌కు చివరి మ్యాచ్‌లోనైనా గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News