Thursday, February 20, 2025

భారత్‌ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే షాక్..!

- Advertisement -
- Advertisement -

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫిని సొంతం చేసుకొనేందుకు ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కి పాకిస్థాన్ అతిధ్యమిస్తుంది.

అయితే టోర్నమెంట్‌లో ఉన్న మిగితా జట్ల కన్న భారత్ పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 23న జరిగే ఈ హోరాహోరి పోరును లైవ్‌లో చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. దీంతో మ్యాచ్‌కి ఉన్న క్రేజ్‌ను బ్లాక్ మార్కెట్లు క్యాష్ చేసుకుంటున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో ఆడమని భారత్ తేల్చి చెప్పడంతో ఆ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారత జట్టు దుబాయ్ చేరుకొని అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు ఐసిసి ఒక్కో టికెట్ ధర 5వేల దిర్హామ్‌(దాదాపు లక్ష, 20వేల రూపాయిలు) గా నిర్ణయించింది.

మ్యాచ్‌ చూసేందుకు టికెట్లు నేరుగా దొరకటి వాళ్లు బ్లాక్‌ మార్కెట్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ఇదే అదునుగా భావించి ఒక్కో టికెట్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో దాదాపు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News