Sunday, November 17, 2024

భారత్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

సిరీస్‌పై సౌతాఫ్రికా కన్ను
నేడు చివరి టి20

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో గురువారం జరిగే మూడో, చివరి టి20 టీమిండియాకు సవాల్‌గా మారింది. రెండో టి20లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం వల్ల తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. అయితే రెండో టి20లో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించి సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. వర్షం వల్ల సౌతాఫ్రికా లక్ష్యాన్ని కుదించడంతో సఫారీలకు విజయం సులువైంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ అసాధారణ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాను గెలిపించాడు. ఈసారి కూడా అతనిపై సౌతాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది.

కెప్టెన్ మార్‌క్రమ్ కూడా జోరుమీదున్నాడు. అతను కూడా చెలరేగితే మరోసారి భారత బౌలర్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఇక రెండో టి20లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. వీరు విఫలం కావడంతో జట్టుకు ఓటమి ఓటమి తప్పలేదు. 154 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలోనే ఛేదించడం గమనార్హం. ఇక రెండో టి20లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది.

అయితే కిందటి మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ ఆటగాళ్లు రింకు సింగ్, తిలక్‌వర్మలు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం జట్టుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. కాగా, యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా సిరీస్‌ను సమం చేయాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా ఉంది. దీంతో సౌతాఫ్రికాను మట్టికరిపించి సిరీస్‌ను సమం చేసినా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News