Wednesday, January 22, 2025

దక్షిణాఫ్రికాతో ఫస్ట్ టెస్టు: తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 208/8

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా జట్టు పై చేయి సాధించింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట కేవలం 59 ఓవర్లు మాత్రమే కొనసాగింది. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ భారత్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. నిప్పులు చెరిగే బంతులతో సఫారి బౌలర్లు చెలరేగుతుండడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కోహ్లీ(38), శ్రేయస్ అయ్యర్(31)లు కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

వీరిద్దరూ ఔటైన తర్వాత కీపర్ కెఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్(24)లు జట్టు బాధ్యతను తీసుకుని స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్(70), సిరాజ్(0)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News