Monday, January 20, 2025

టీమిండియాకు షాక్.. వెంటవెంటనే రెండు వికెట్లు డౌన్

- Advertisement -
- Advertisement -

పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియాకు షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఓపెనర్లు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లు నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అయితే, క్రీజులో నిలదొక్కుకుని వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్(29)ను మార్ క్రమ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(0)ను తర్వాత ఓవర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్ పంపి టీమిండియాకు షాకిచ్చాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.  క్రీజులో రాహుల్(28), రిషబ్ పంత్(4)లు ఉన్నారు.

IND vs SA 2nd ODI: Kohli dismissed by Keshav Maharaj

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News