Sunday, January 19, 2025

సౌతాఫ్రికాతో రెండో వన్డే: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచి సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(4) పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజులో మరో ఓపెనర్ సాయి సుదర్శన్(7), తిలక్ వర్మ(2)లు ఉన్నారు.

కాగా, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News