- Advertisement -
గౌహతీ: మూడు టీ20 సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో బ్యాట్స్ మెన్స్ చెలరేగి ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(43), కెఎల్ రాహుల్(57)లు ధనాధన్ బ్యాటింగ్ తో శుభారంభం అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(49 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(61), దినేష్ కార్తిక్(17 నాటౌట్)లు ఫోర్లు, సిక్సర్లతో సఫారి బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో సౌతాఫ్రికాకు, టీమిండియా 238 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs SA 2nd T20: India Set 238 target for South Africa
- Advertisement -