Sunday, December 22, 2024

రోహిత్, కెఎల్ రాహుల్ ఔట్.. భారీ స్కోరు దిశగా టీమిండియా

- Advertisement -
- Advertisement -

IND vs SA 2nd T20: Rohit and Rahul dismissed by Maharaj

గౌహతీ: మూడు టీ20 సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(43), కెఎల్ రాహుల్(57)లు ధనాధన్ బ్యాటింగ్ తో శుభారంభం అందించారు. ముఖ్యంగా రాహుల్ కేవలం 24 బంతుల్లో అర్థశతకం బాదాడు. జోరుమీదున్న వీరిద్దరినీ సఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఔట్ చేసి జట్టు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్ల నష్టానికి 13 ఓవర్లలో 125 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(8), సూర్యకుమార్ యాదవ్(12)లు ఉన్నారు.

IND vs SA 2nd T20: Rohit and Rahul dismissed by Maharaj

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News