Sunday, December 22, 2024

6 వికెట్లతో చెలరేగిన సిరాజ్.. 55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్

- Advertisement -
- Advertisement -

కేప్ టౌన్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. రెండో టెస్టులో టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాప్రికా బ్యాట్స్ మెన్లపై భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు నిప్పులు చెరిగారు. ఏ ఒక్క బ్యాట్స్ మెన్.. 20 పరుగులు కూడా చేయలేకపోయారు.

కనీసం క్రీజులో నిలదొక్కుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు బారత బౌలర్లు. దీంతో సఫారీ బ్యాట్స్ మెన్లు వరుసగా ఒకరివెంట ఒకరు పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో 55 పరుగులకే సఫారి జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, ముకేశ్ లు తలో రెండు వికెట్లు తీశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News