Wednesday, January 22, 2025

రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 176 ఆలౌట్.. భారత్ టార్గెట్ 78 పరుగులు

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా-టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. ఒపెనర్ మార్ క్రమ్(106) సెంచరీతో రాణించాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. దీంతో భారత్ కు సఫారీ జట్టు 78 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లతో సఫారీ జట్టు వెన్ను విరిచాడు. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ కృష్ణలు చెరో వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 98 పరుగుల ఆధిక్యం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News