- Advertisement -
దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 29 ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. దీంతో టీమిండియాపై 51 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఒపెనర్ మార్క్ రామ్ ఒక్కడే పట్టుదలగా క్రీజు వదలకుండా బ్యాట్ ఝళిపిస్తున్నాడు. అతను 94 బంతుల్లో 94 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్నాడు. కాగా బుధవారం మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా, గురువారం 86 పరుగులు జోడించి, మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మార్క్ రామ్ 94 పరుగులతోనూ, రబడా రెండు పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.
- Advertisement -