జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ రోజు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా గెలుపు బాటలో ప్రయాణిస్తోంది. సౌతాఫ్రికా బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే మరో 122 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ఎల్గర్ (46), డుసెన్ (11)లు ఉన్నారు. స్వల్ప లక్ష్యమే ఉండడంతో దక్షిణాఫ్రికాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
DAY 4 | START DELAYED ☂️
Inclement weather had brought about a delayed start to Day 4 fo the 2nd Betway Test at Imperial Wanderers#SAvIND #FreedomTestSeries #BePartOfIt pic.twitter.com/ZPZSuw7juy
— Proteas Men (@ProteasMenCSA) January 6, 2022
IND vs SA 2nd Test: Day 4 Start delay due to Rain