దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులో చేలరేగడంతో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదట్లో రోహిత్ శర్మ(39), శుభ్ మన్ గిల్(36)లు కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఔటన తర్వాత విరాట్ కోహ్లీ(46), కెఎల్ రాహుల్(08)లు జట్టు బాధ్యతను తీసుకున్నారు.
వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేయగా… రాహుల్ డిఫెన్స్ చేశాడు. ఈ క్రమంలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి కుదురుకుంటుండగా.. బంతి అందుకున్న లుంగీ ఎంగిడి భారత్ ను దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి షాకిచ్చాడు. ఆ తర్వాత రబాడ మిగతా వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఒక పరుగు కూడా ఇవ్వకుండా చివరి ఆరు వికెట్లను పడగొట్టారు. దీంతో భారత్ కు 98 పరుగుల స్పల్ప ఆధిక్యం లభించింది.