దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు. సఫారీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులో చేలరేగుతున్నారు. దీంతో భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(39), యశస్వి జైశ్వాల్(0), శుభ్ మన్ గిల్(36), శ్రేయస్ అయ్యర్(0)లు మరోసారి విఫలమయ్యారు. దీంతో భారత్ 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(20), కెఎల్ రాహుల్(0)లు ఉన్నారు.
అంతకుముందు టీమిండియా బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. టాస్ గెలచి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ బ్యాట్స్ మెన్లపై భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి సఫారీల వెన్నువిరిచాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకు కుప్పకూలింది.