Wednesday, January 22, 2025

శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన యువ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ను కనబరిచిన శార్దూల్ ఏడు వికెట్లను తీసి సఫారీ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. దీంతో నెటిజన్లు, అభిమానులు, మాజీ క్రికెటర్లు శార్దూల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కీలక సమయంలో ఏడు వికెట్లు తీసి శార్దూల్ టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడని కొనియాడుతున్నారు. శార్దుల్ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 229 పరుగులకు ఆలౌటైంది. దీంతో 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆలౌటైంది.

IND vs SA 2nd Test: Netizens praised Shardul Thakur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News