Sunday, December 22, 2024

శార్దుల్ ఠాకూర్ ఫైర్.. దక్షిణాఫ్రికా 229 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 202 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు కష్టాలు ఖాయమని అందరూ భావించారు. కానీ యువ స్పీడ్‌స్టర్ శార్దూల్ ఠాకూర్ ఏడు వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకే కుప్పకూలింది. దీంతో సఫారీలకు కేవలం 27 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా మంగళవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 58 పరుగులకు చేరింది. అజింక్య రహానె (11), చటేశ్వర్ పుజారా (35) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు రాహుల్ (8), మయాంక్ అగర్వాల్ (23) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
శార్దూల్ విజృంభణ..
35/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆరంభంలో బాగానే ఆడింది. కెప్టెన్ డీన్ ఎల్గర్, పీటర్సన్‌లు సమన్వయంతో ఆడుతూ భారత బౌలర్లను అసహనానికి గురి చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు భారత నిరీక్షణకు శార్దూల్ తెరరించాడు. ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేస్తున్న ఎల్గర్‌ను అతను వెనక్కి పంపాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఎల్గర్ 120 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 74 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపించింది. కొద్ది సేపటికే పీటర్సన్ కూడా ఔటయ్యాడు. 118 బంతుల్లో 9 ఫోర్లతో 62 పరుగులు చేసిన అతన్ని కూడా ఠాకూర్ ఔట్ చేశాడు. అంతేగాక కీలక బ్యాటర్ వండర్ డుసెన్‌ను కూడా శార్దూల్ వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బవుమా ఒంటరి పోరాటం చేశాడు. అతనికి వికెట్ కీపర్ వెరినే అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సమన్వయంతో ఆడిన వెరినే (21)ను కూడా శార్దూల్ ఔట్ చేశాడు. అంతేగాక బవుమా (51)కూడా శార్దూల్ వెనక్కి పంపాడు. జాన్‌సెన్ (21), కేశవ్ మహారాజ్ (21) కొద్ది సేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికీ సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 79.4 ఓవర్లలో 229 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో శార్దూల్ మూడు, షమి రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు ఒక వికెట్ దక్కింది.

IND vs SA 2nd Test: Shardul Thakur claims 7 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News