Sunday, January 19, 2025

నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. ఏడో వికెట్ కోల్పోయిన సఫారీ జట్టు..

- Advertisement -
- Advertisement -

కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో సఫారీ బ్యాట్స్ మెన్లు పెవిలియన్ క్యూ కట్టారు. బుధవారం కేప్ టౌన్ లో ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాప్రికా బ్యాట్స్ మెన్లకు భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు చుక్కలు చూపెడుతున్నారు. దీంతో 45 పరుగులకే సఫారి జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది.

సిరాజ్ 6 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 46 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో కేశవ్ మహారాజ్(03), డేవిడ్ బెడింగ్‌హామ్(0)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News