Monday, December 23, 2024

రెండో టెస్టులో భారత్ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 78 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ యశస్విజైశ్వాల్ 28 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగులు, గిల్ 10 పరుగులు, కోహ్లీ 12పరుగులు చేయడంతో భారత్ కేవలం 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై గెలుపొందింది.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో 105/3 స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 176 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లతో సఫారీ వెన్ను విరిచాడు. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ కృష్ణలు చెరో వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 98 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ విజయంతో భారత్, టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News