టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆచితూచి ఆడుతోంది. వన్డేలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ 22 పరుగులు చేసి.. నాండ్రీ బర్గర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మొదటి రెండు వన్డేల్లోనూ అదరగొట్టిన సాయి సుదర్శన్, కీలకమైన మూడో వన్డేలో నిరాశ పరిచాడు. హెండ్రిక్స్ ఓవర్లో సాయి (10) అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కెఎల్ రాహుల్(21) కూడా విఫలమయ్యాడు. దీంతో 101 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. దీంతో ఒత్తిడిలో పడిన జట్టు బాధ్యతను తీసుకున్న సంజూశాంసన్.. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో సంజూ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్ 29 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో సంజూశాంసన్(51), తిలక్ వర్మ(9)లు ఉన్నారు.