- Advertisement -
కేప్‌టౌన్:మూడో చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోట్పోయింది.17/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మార్ క్రమ్(8)ను భారత బౌలర్ బుమ్రా బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్ నెమ్మదిగా ఆడుతుండగా, కేశవ్ మహారాజ్ దూకుడుగా ఆడుతూ ఎదురు దాడికి దిగాడు. ఈక్రమంలో బంతి అందుకున్న ఉమేశ్ యాదవ్, కేశవ్ మహారాజ్(25) ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. క్రీజులో కీగన్ పీటర్సన్(12), డస్సెన్(7)లు ఉన్నారు. భారత్ ఇంకా 162 పరుగుల అధిక్యంలో ఉంది.
IND vs SA 3rd Test: Keshav Maharaj dismissed for 25
- Advertisement -