Sunday, December 22, 2024

మరికాసేపట్లో సౌతాఫ్రికాతో తొలి వన్డే.. సంజూ శాంసన్ కు లాస్ట్ ఛాన్స్?

- Advertisement -
- Advertisement -

టీమిండియా, ఆథిత్య సౌతాఫ్రికా జట్టు మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు మరికొద్దసేపట్లో తెరలేవనుంది. జోహెన్నస్‌బర్గ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. ఇటీవల జరిగిన టి20 సిరీస్ చివరి మ్యాచ్ లో గెలిచి 1-1తో సమం చేసిన భారత కుర్రాళ్లు అదే జోష్ లో వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు.

టి20లలో ఆడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్, జడేజా తదితరులు ఈసారి జట్టుకు దూరంగా ఉన్నారు. వన్డే సిరీస్‌లో కెఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియాకు బరిలోకి దిగనుంది. యువ ఆటగాళ్లు రజత్ పటిదార్, సాయి సుదర్షన్, అవేశ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ లతోపాటు సంజు శాంసన్, చాహల్, అక్షర్ పటేల్ లకు జట్టులో చోటు దక్కింది. టి20లలో మెరుపులు మెరిపించిన యువ సంచలనం రింకు సింగ్ వన్డేల్లో కూడా బరిలోకి దిగనున్నాడు.

అయితే, అందరి పరిస్థితి ఎలా ఉన్నా.. సంజు శాంసన్ కు మాత్రం ఈ సిరీస్ పరీక్షనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను ఇప్పటివరకు సంజూ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇతర ఆటగాళ్లతో పోల్చితే సంజుకు టీమిండియాలో చాలా తక్కువ అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి. ఒకటి రెండు మ్యాచుల్లో విఫలమైతే అతన్ని జట్టు నుంచి తొలగిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలతో సంజు ఉన్నాడు. ఈ సిరీస్ లో సక్సెస్ ఫుల్ గా రాణించడంపైనే అతని భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ, ఈ సిరీస్ లో విఫలమైతే అతని కెరీర్ ఇబ్బందుల్ పడే ఛాన్స్ ఉంది, మరి, ఇందులో ఎంతవరకు సఫలమవుతాడో చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News