Sunday, December 22, 2024

రోహిత్ శర్మ ఔట్

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కురవడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ క్రీజులో వచ్చారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ ఐదు పరుగులు రబాడా బౌలింగ్ లో నాండే బర్గర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగింది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్థూల్ టాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

సౌతాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్, ఎయిడెన్ మక్రమ్, టోనీ డి జోర్జి, తెంబా బవుమా (కెప్టెన్), డెవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వీరయన్నే, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, గీరాల్డ్ కోయిట్జీ, కగిసో రబాడా, లుంగి ఎంగిడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News