Thursday, January 23, 2025

సెకండ్ వన్డేలో రింకునా?… రజత్ పటీదారా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత సిరీస్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో కోహ్లీ, శేఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అశ్విన్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా కూడా సఫారీల గడ్డపై ఒక్క వన్డేలో కూడా విజయం సాధించలేదు. ఇప్పుడు జట్టు నిండా కుర్రాలే కానీ తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 1982 నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై ఆరు వన్డే సిరీస్‌లో ఒక వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం పాలైన సఫారీలు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు.  రెండో వన్డే ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ టెస్టు సిరీస్ కోసం వన్డే జట్టు నుంచి తప్పుకున్నాడు. అయ్యర్ స్థానంలో రింకు సింగ్ లేదా రజత్ పటీదార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

రింకు టి20ల్లో మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరో స్థానంలో సంజు శాంసన్ ఉండడంతో రింకును బెంచ్ కు పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. దేశవాలీ క్రికెట్‌లో రజత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో శ్రేయస్ నాలుగు స్థానంలో ఆడడంతో రజత్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రింకును తీసుకుంటే తిలక్ వర్మను బెంచ్ కు పరిమితం చేయాల్సి వస్తుంది.

బౌలింగ్ విభాగంలో యువ పేసర్లు అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ తొలి వన్డేలో విజృంభించి సఫారీల వెన్నువిరిచారు. ముఖేష్ కుమార్ ఒక్కడే దారుళంగా పరుగులు ఇచ్చాడు. ముఖేష్ తొలగించి ఆకాశ్‌దీప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. స్పినర్ల విభాగంలో అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ జట్టులో ఉన్నారు.

భారత జట్టు: కెఎల్ రాహుల్(కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్ లేదా రింకు సింగ్, తిలక్‌వర్మ, సంజు శాంసన్, అక్షర్‌పటేల్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్

దక్షిణాఫ్రికా: మారక్రమ్(కెప్టెన్), టోనీ జార్జీ, హెండ్రిక్స్, క్లాసెస్, వండర్ డసెన్, మిల్లర్, కేశవ్ మహారాజ్, ముల్దర్, ఫెలుక్వాయో, బర్గర్, షంసి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News