Monday, January 20, 2025

రసవత్తరంగా రెండో టెస్టు

- Advertisement -
- Advertisement -

బౌలర్ల హవా.. ఒకే రోజు 23 విట్లు
సౌతాఫ్రికా 55, 62/3
36 పరుగుల ఆధిక్యంలో భారత్
కేఫ్‌టౌన్ : సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఒకే రోజు మూడు ఇన్నింగ్స్‌లో 23 వికెట్లు పడగొట్టి బౌలర్లులు బ్యాటర్ల శాసిస్తున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడు కీలక వికెట్లు కోల్పోయి 36తో వెనబడి ఉంది సౌతాఫ్రికా జట్టు. బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్(6/15) ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఇన్నింగ్స్ మొదలు పెట్ట సమయంలో కాస్తా ఆచీతూచి ఆడినా చివరలో ఎన్‌గిడి, రబాడా మెరుపు బంతులకు క్రీజులో నిలదొక్కుకోలేక 153 పరుగులకు చాపచుట్టేసింది.
సౌతాఫ్రికా 55/ఆఔట్
ఇక అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా… జస్‌ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్‌హమ్ (12), కైల్ వెర్రెయన్(15) మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. ఫస్ట్ సెషన్‌లోనే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
11 బంతులు.. 6 వికెట్లు..
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ చెత్త రికార్డును భారత్ ఖాతాలో చేసుకుంది. ఈ టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు కుప్పకూలింది. తొలుత 153/4 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన భారత్ అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. చివరి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారి పట్టారు. కాగా, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక్క పరుగు కూడా చేయకుండా చివరి 6 వికెట్లు సమర్పించుకోవడం ఇదే ప్రథమం. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్(0) వికెట్ కోల్పోయినా.. శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 5 ఫో ర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39) నిలకడగా బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. కోహ్లీతో కలిసి శుభ్‌మన్ గిల్ ఆచీతూచి ఆడాడు. మూడో వికెట్‌కు 27 పరుగులు జోడించిన అనంతరం శుభ్‌మన్ గిల్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రా హుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అనంతరం రాహుల్(8) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్ భారత ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడే జా(0), జస్‌ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరా జ్(0), ప్రసిధ్ కృష్ణ(0) ఒక్క పరుగు లేకుండా వెనుదిరిగారు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ సైతం క్యాచ్ ఔటయ్యాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News