Sunday, December 22, 2024

భారత్‌-శ్రీలంక మధ్య ఉత్కంఠ పోరు.. టైగా ముగిసిన తొలి వన్డే

- Advertisement -
- Advertisement -

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డే మ్యాచ్ చివరికి టైగా ముగిసింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా (56), దునిత్ వెల్లలాగె 67(నాటౌట్), హసరంగ (24) జట్టును ఆదుకున్నారు.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో అర్ష్‌దీప్, అక్షర్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ (58), అక్షర్ పటేల్ (33), శివమ్ దూబె (25) రాణించినా జట్టును గెలిపించలేక పోయారు. లంక బౌలర్లు సమష్టిగా రాణించి మ్యాచ్‌ను టైగా ముగించడంలో సఫలమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News