Monday, December 23, 2024

చెలరేగిన ఇషాన్, అయ్యర్.. శ్రీలంక టార్గెట్ @200

- Advertisement -
- Advertisement -

లఖన్ వూన్: శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ(44), ఇషాన్ కిషన్(89)లు లంక బౌలర్లపై ఆది నుంచే ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి కేవలం 10 ఓవర్లలోనే 100 భాగస్వమ్యాన్ని నమోదు చేశారు. ఇక, శ్రేయస్ అయ్యర్(55) ధనాధన్ బ్యాటింగ్ చెలరేగిపోయాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో భారత్, శ్రీలంక జట్టుకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

IND vs SL 1st T20: Sri Lanka need 200 runs to win

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News