Monday, January 20, 2025

తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 174 ఆలౌట్.. భారత్ కు భారీ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

మొహాలిలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు 174 పరుగులకు ఆలౌటైంది. 108/4 ఓవర్ నైట్ స్కోరుతో లంక.. మూడోరోజు ఆట ప్రారంభించింది. అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్ తో చెలరేగడంతో లంక జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో 65 ఓవర్లలో 174 పరుగులకే లంక జట్టు కుప్పకూలింది. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, బుమ్రాకు రెండేసి వికెట్లు, షమీ ఒక వికెట్‌ తీశారు. ఇక, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 574/8 వద్ద డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా 400 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

IND vs SL 1st Test Day 3: Sri Lanka All Out at 174

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News